
4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే
చిన్నశంకరంపేట(మెదక్): ఈనెల 4న మెదక్ విద్యుత్‌శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ దినకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యుత్ బిల్లు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ను జతచేయాలని సూచించారు.
పోరాటయోధుడు
పాపన్నగౌడ్
మెదక్‌జోన్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం పాపన్నగౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆ పరిశ్రమపై
చర్యలు తీసుకోండి
మనోహరాబాద్(తూప్రాన్): కార్మికుడి మరణానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలో డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్‌రెడ్డికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమార్స్ పరిశ్రమలో మంగళవారం రఘునాథ్‌సింగ్ అనే కార్మికుడు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడన్నారు. పరిశ్రమ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పలు పరిశ్రమల్లో కనీస వసతులు లేకుండానే, భద్రతా చర్యలు చేపట్టకుండానే కార్మికులతో 10 నుంచి 12 గంటల చొప్పున పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాకి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
మైనర్లకు బైక్‌లు ఇస్తే
కఠిన చర్యలు: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు బావు లు, చెరువులు, వాగుల్లో ఈతకు వెళ్లే అవకాశం ఉందని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సర దా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారిని పట్టుకొని వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. వేసవిలో క్రీడా శిక్షణ కేంద్రాలకు పంపి మీ పిల్లలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు.
ఢిల్లీ వెళ్లిన
బీసీ సంఘం నేతలు
రామాయంపేట (మెదక్): 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనకు జిల్లాకు చెందిన బీసీ సంఘం నాయకులు భారీగా తరలివెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే

4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే