
తూప్రాన్ మున్సిపాలిటీకి అవార్డు
తూప్రాన్: జిల్లాలోనే తూప్రాన్ మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆస్తి పన్ను వసూళ్లలో 82.17 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈసందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా కమిషనర్ పాతూరి గణేష్‌రెడ్డి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమష్టి కృషి ఫలితంగానే అవార్డు దక్కిందని తెలిపారు.