
రాములోరి కల్యాణానికి వేళాయే
మెదక్‌జోన్: సీతారాముల కల్యాణ మహోత్సవానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయాన్ని నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామం, పూలజడతో వధువు సీతమ్మ పెళ్లికి ముస్తాబయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఎదుర్కోలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి పెళ్లి కనుల పండువగా జరగనుంది. కాగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దంపతులు సమర్పించనున్నారు.
నేడే శ్రీరామనవమి

రాములోరి కల్యాణానికి వేళాయే