వైరల్‌ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు | Viral: A Proud Father Checks The Stars On Cop Daughter Uniform | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు

Published Mon, May 11 2020 12:47 PM | Last Updated on Mon, May 11 2020 5:04 PM

Viral: A Proud Father Checks The Stars On Cop Daughter Uniform - Sakshi

ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలోని తండ్రి, కూతుళ్లపై ప్రముఖులతో పాటు నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న పోలీసు అధికారి పేరు రతన గ్నసెప్పం. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో డిప్యూటీ ఎస్పీగా ఉన్న ఆమె పోలీసు యూనిఫామ్‌పై ఉన్న నక్షత్రాలను రతన్‌ తండ్రి ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఫొటోను అమిత్‌ పంచాల్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. తన యూనిఫామ్‌పై ఉన్న నక్తత్రాలను తండ్రి కళ్లలో చూస్తున్న రతన్‌ అంటూ క్యాప్షన్‌తో ఈ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

కూతురు సాధించిన విజయం తాలుకు సంతోషం తండ్రి కళ్లలో కనబడుతోందని కొందరు ప్రశసించగా, మహిళా సాధికారతకు ఉదాహరణగా మరికొందరు పేర్కొన్నారు. ఈ ఫొటోకు ట్విటర్‌లో ఇప్పటివరకు 15 వేలకు పైగా లైకులు రాగా, 2 వేల మందిపైగా రిట్వీట్‌ చేశారు. అయితే ఈ ఫొటో కొన్నినెలల కిందటిదని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది. రతన ప్రస్తుతం అడిషినల్‌ ఎస్పీగా పనిచేస్తున్నారని తెలిపింది. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement