మహారాష్ట్రలోని అవార్డుల కార్యక్రమంలో వడదెబ్బతో సుమారు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన చర్చనీయాంశంగా మారడమే గాక సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని నిషేధించింది. వాస్తవానికి నాడు బహిరంగ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూషణ్ అవార్డుల కార్యక్రమానికి లక్షలాదిమంది హాజరయ్యారు. ఆ సమావేశం మండే ఎండలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఆ సమావేశం జరిగనప్పుడూ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఈ కార్యక్రమానిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండే రూ. 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. షిండే ప్రభుత్వంపై నరహత్య కేసు నమోదు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదని, మానవ నిర్మిత విపత్తు అని విమర్శులు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పవార్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ఇవ్వాలని కూడా పవార్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment