
రాజ్‌నాథ్ అలా చెప్పగానే ఇలా పండగ
ఆహారం తినే విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అది వారి హక్కు అని, తాము ఎలాంటి షరతులు పెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసిన వెంటనే మిజోరంలో పండుగ చేసుకున్నారు.
ఐజ్వాల్: ఆహారం తినే విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అది వారి హక్కు అని, తాము ఎలాంటి షరతులు పెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసిన వెంటనే మిజోరంలో పండుగ చేసుకున్నారు. పెద్దమొత్తంలో జనాలు పోగై బీఫ్‌తో వంటలు చేసి ఓ సమూహంగా చేరి భోజనం చేశారు.
వీరిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. కబేళాలకు పశువులను విక్రయించడంపై పలు నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో అవి తమ ఆహారంపై ప్రభావం చూపిస్తున్నాయంటూ పెద్ద మొత్తంలో మిజోరంలో ప్రజలు ఆందోళనలు లేవదీసిన విషయం తెలిసిందే. వీరిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఏకంగా ఓ ఇద్దరు పెద్ద బీజేపీ నేతలు కూడా కేంద్రం తెచ్చిన రూల్‌ను వ్యతిరేకిస్తూ తమ పార్టీని వదిలేశారు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ సంబంధాలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించగా ఈ కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.