మిజోరాంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి ఐదుగురు గాయపడ్డారు.
ఐజ్వాల్ : మిజోరాంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి ఐదుగురు గాయపడ్డారు. ఐజాల్లోని పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. క్షతగాత్రులను నగరంలోని చర్చి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని పంపినట్లు చెప్పారు. ఒక్క సెకను కాలంలోనే భూమి పలు సార్లు కంపించిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని 134 కిలోమీటర్ల భూమి అడుగు భాగంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ భూకంపం బుధవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో వచ్చిందన్నారు.