మిజోరం: ముగ్గురు తిరుగుబాటుదారులను శుక్రవారం మిజోరం పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్లోని హమర్ పీపుల్ కాన్వెన్షన్(డెమోక్రాట్స్)కు చెందిన తిరుగుబాటుదారులు మిజోరంలోని బికవతీర్ అనే గ్రామంలోకి చొరబడి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండగా వారిని అరెస్టు చేశారు. దీంతోపాటు వారికి రూ.12 వేలు అందజేస్తున్న ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాంటి వారిని ప్రోత్సహించడం కూడా నేరమే అవుతుందని ఈ సందర్భంగా పోలీసులు వారికి స్పష్టం చేశారు.
ముగ్గురు తిరుగుబాటుదారుల అరెస్టు
Published Fri, Sep 18 2015 2:01 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM
Advertisement
Advertisement