మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శనివారం అర్ధరాత్రి జరిగిన బస్సు లోయలో పడిపోవడంతో 11 మంది ప్రయాణికులు మృతి చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మిజోరం: మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శనివారం అర్ధరాత్రి జరిగిన బస్సు లోయలో పడిపోవడంతో 11 మంది ప్రయాణికులు మృతి చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిజోరం రాజధాని ఐజ్వాల్ నుండి లంట్లేకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రాంలైతు గ్రామం వద్ద లోయలో పడిపోయింది. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. డ్రైవర్ తాగి బస్సు నడపడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సెర్చిప్ జిల్లాలోగల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.