
ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ రోజు ఉదయం అల్మోరా ప్రాంతం నుంచి నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు తోటమ్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
లోయలో పడిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 24 మంది ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
#SpotVisuals: 13 dead as a bus fell into a gorge in #Uttarakhand's Totam. pic.twitter.com/ociQzKk12C
— ANI (@ANI) March 13, 2018