కఠ్మాండు: నేపాల్‌లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడటంతో 31 మంది మృత్యువాతపడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మమతా దేవీ ఠాకూర్ అనే భారతీయ మహిళ కూడా ఉంది. నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. రాజ్‌బిరాజ్ నుంచి కఠ్మాండు వెళ్తున్న బస్సు ఘటబేసీలోని ఓ మలుపు వద్ద అదుపుతప్పి త్రిశూలీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో పడిన 16 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment