రాష్ట్రంలో నలభై స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది.
మిజోరాం: రాష్ట్రంలో నలభై స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,90,860 మంది ఓటర్లు ఉన్న మిజోరాంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా మణిపూర్ నియోజక వర్గంలో కలిసిన మూడు స్థానాల్లోని ఓటర్లు 80 శాతానికి పైగా ఓటింగ్లో పాల్గొనడం విశేషం. కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా సహా పదకొండు మంది మంత్రులు భవిష్యత్తు బ్యాలెట్ బ్యాక్సుల్లోకి చేరింది.