ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు! | One family that is much sought after in Mizoram | Sakshi
Sakshi News home page

ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు!

Published Fri, Apr 11 2014 5:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు! - Sakshi

ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు!


శుక్రవారం బుల్లి రాష్ట్రం మిజోరాంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎంపీ సీటుకు ఎన్నిక జరిగింది. ఈ పోటీలో అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన పేరు జియోన్గాకా చానా.
ఇంతకీ ఎందుకు అన్ని పార్టీలూ చానా చుట్టు తిరుగుతున్నాయి? ఎందుకంటే ఆయనకు 39 మంది భార్యలు, 127 మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు. వీరందరితో కలిసి నూరు గదుల సువిశాలమైన ఇంట్లో చానా నివసిస్తూ ఉంటాడు. వీరిలో భార్యలందరూ ఓటర్లే. కొడుకుల్లోనూ దాదాపు 80 మంది ఓటర్లున్నారు. అంటే చానా చేతిలో దాదాపు 160కి పైగా ఓట్లున్నాయి. ఇంకా తమాషా ఏమింటే వీరంతా చానా మాటను జవదాటరు. ఆయన ఏ పార్టీకి వేయమంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. అంటే గుండుగుత్తగా 160 ఓట్లు ఒకే పార్టీకి పడతాయన్నమాట.
మిజోరాం జనాభా చాలా తక్కువ. కొన్ని లక్షలే ఉంటుంది. కాబట్టి వంద ఓట్లు గెలుపోటములను నిర్ధారిస్తాయి. అందుకే పార్టీలన్నీ చానా గారి చుట్టూ చానా చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనూ చానా చుట్టూ లీడర్లు ఇలాగే తిరిగారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement