large family
-
ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి..
ఇస్లామాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజామానిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ మజీద్ మంగల్(75) తుదిశ్వాస విడిచాడు. పాకిస్తాన్‌కు చెందిన ఈయన.. బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అబ్దుల్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డ్రైవర్‌గా పనిచేసే అబ్దుల్‌కు మొత్తం ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. బలూచిస్తాన్ నోష్కి జిల్లా కాలి మంగల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే ఆరుగురు భార్యల్లో ఇద్దరు చనిపోయారు. 54 మంది పిల్లలో 12 మంది వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన 42 మంది పిల్లలలో 22 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్దుల్ మనవళ్లు, మనవరాళ్లను కూడా కలిపితే ఆయన కుటుంబంలో మొత్తం 150 మంది అవుతారు. అబ్దుల్ 18 ఏళ్ల వయసులోనే తొలి వివాహం చేసుకున్నాడు. 2017లో జనాభా లెక్కల కోసం ఆయన ఇంటికి వెళ్లిన సబ్బింది వివరాలు సేకరించాక కంగుతిన్నారు. ఆయనకు ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు అని తెలిసి అవాక్కయ్యారు. అప్పటినుంచే ఆయన అతిపెద్ద కుటుంబానికి యజమానిగా గుర్తింపు పొందారు. చదవండి: Rishi Sunak: ఓటమి భయంతో.. -
ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు!
శుక్రవారం బుల్లి రాష్ట్రం మిజోరాంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎంపీ సీటుకు ఎన్నిక జరిగింది. ఈ పోటీలో అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన పేరు జియోన్గాకా చానా. ఇంతకీ ఎందుకు అన్ని పార్టీలూ చానా చుట్టు తిరుగుతున్నాయి? ఎందుకంటే ఆయనకు 39 మంది భార్యలు, 127 మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు. వీరందరితో కలిసి నూరు గదుల సువిశాలమైన ఇంట్లో చానా నివసిస్తూ ఉంటాడు. వీరిలో భార్యలందరూ ఓటర్లే. కొడుకుల్లోనూ దాదాపు 80 మంది ఓటర్లున్నారు. అంటే చానా చేతిలో దాదాపు 160కి పైగా ఓట్లున్నాయి. ఇంకా తమాషా ఏమింటే వీరంతా చానా మాటను జవదాటరు. ఆయన ఏ పార్టీకి వేయమంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. అంటే గుండుగుత్తగా 160 ఓట్లు ఒకే పార్టీకి పడతాయన్నమాట. మిజోరాం జనాభా చాలా తక్కువ. కొన్ని లక్షలే ఉంటుంది. కాబట్టి వంద ఓట్లు గెలుపోటములను నిర్ధారిస్తాయి. అందుకే పార్టీలన్నీ చానా గారి చుట్టూ చానా చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనూ చానా చుట్టూ లీడర్లు ఇలాగే తిరిగారట!