![Coronavirus : Mizoram Goes Back Into Total Lockdown For Two Weeks - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/8/corona_4.jpg.webp?itok=DzWO9dpE)
ఐజ్వాల్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మిజోరాం ప్రభుత్వం అప్రమత్తమైంది. మిజోరాంలో రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగా ప్రకటించారు. సోమవారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మిజోరాంలో మంగళవారం కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 42కు చేరుకుంది. వీరిలో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 41 మంది బాధితులకి జోరాం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. (చదవండి : స్కూల్స్ తెరుచుకునేది అప్పుడే !)
Comments
Please login to add a commentAdd a comment