ఐజాల్ : అది మిజోరమ్ రాష్ట్రంలోని బక్తావంగ్ గ్రామం. ఆ గ్రామంలో నాలుగంతస్తుల భవనం. అందులో వందగదులు ఉన్నాయి. వాటిల్లో 181 మంది నివసిస్తున్నారు. వారంతా ఒకటే కుటుంబం సభ్యులంటే ఆశ్చర్యం వేస్తోంది. అవును ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా ఘనతి కెక్కిన 72 ఏళ్ల జియోనా కుటుంబం ఈ భవనంలోనే నివసిస్తోంది.
ఆయనకు 39 మంది భార్యల ద్వారా 94 మంది పిల్లలు పుట్టారు. ఆయనకు 14 మంది కోడళ్లు, 40 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఒక్క కుటుంబంలోని నలుగురు వ్యక్తులే కలసి మెలసి ఉండని ఈ రోజుల్లో ఏకంగా ఇంతమంది భార్యలు, పిల్లలు, వారి పిల్లల పిల్లలు, కలసిమెలసియే కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవిస్తున్నారు. వారంతా వంటావార్పు కలసే చేసుకుంటారు. రోజుకు ఆ భారీ కుటుంబానికి 50 కిలోల బియ్యం, 70 కిలోల మాంసం కావాలట. జియోనా పుట్టుకతోని ధనవంతుడు అవడం వల్ల అంత మందిని ధైర్యంగా పెళ్లి చేసుకున్నారు. వయస్సులో ఉండగా అందరి పోషణ బాధ్యత ఆయనే చూసుకోగా, ఇప్పుడు కుటుంబం పోషణకు కుటుంబంలోని సభ్యులంతా తలా ఓ చేయి వేస్తున్నారు.
జియోనా కుటుంబానికి సంబంధించిన ఫొటోలు ఇదివరకే వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
39 మంది భార్యలు, 181 మంది కుటుంబ సభ్యులు
Published Mon, Oct 23 2017 1:39 PM | Last Updated on Mon, Oct 23 2017 6:31 PM
1/4
2/4
3/4
4/4
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment