
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో హైదరాబాద్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు సాధించి 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు జట్లున్న ప్లేట్ డివిజన్‌లో భాగంగా మిజోరం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.
ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 458/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 9 వికెట్లకు 465 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిజోరం 43.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 74 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈనెల 9 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో నాగాలాండ్‌తో హైదరాబాద్; మేఘాలయతో మిజోరం ఆడతాయి. ఫైనల్ చేరిన రెండు జట్లు వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌లో ఎలైట్ డివిజన్‌లో ఆడతాయి.
చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో