అమెరికాలో అధ్యక్ష పోరు మరింత రసవత్తరంగా మారింది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు మళ్లించుకునేందుకు అన్ని చేస్తున్నారు. అయితే ఇంతలో మరో పరిణామం వెలుగు చూసింది.
ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ కనిపించడంలేదు. ఇది ‘అసోసియేటెడ్ ప్రెస్- ఎన్‌ఓఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్’ సర్వేలో వెల్లడయ్యింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, 10మంది ఓటర్లలో నలుగురు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలడన్నారు. మరోవైపు కమలా హారిస్ కూడా మెరుగ్గానే ఎకానమీని సరిదిద్దగలరని అంతే మంది తమ అభిప్రాయం తెలిపారు. ఈ సర్వేలో కొందరు అటు ట్రంప్, ఇటు కమలా ఇద్దరికీ మద్దతు పలకడం గమనార్హం.
ఈ సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం 10మంది ఓటర్లలో 8మంది ఓటర్లు, ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నామని, వీటి పరిష్కారంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థలకే మద్దతిస్తామన్నారు. మూడింట ఒక వంతు మంది మాత్రమే జాతీయ ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు బాగుందని అభిప్రాయడ్డారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మందికిపైగా ఆరోగ్య సంరక్షణ తమ ప్రధాన ప్రయారిటీగా పేర్కొన్నారు. మరికొందరు దేశంలో పెరుగుతున్న నేరాలు, ఇమ్మిగ్రేషన్, అబార్షన్ పాలసీ, గన్ పాలసీలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు వాతావరణ మార్పు, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఓటర్లను ప్రభావితం చేస్తాయన్నారు. గాజాలో యుద్ధాన్ని ఎవరు సమర్థంగా నియంత్రిచగలుగుతారనే ప్రశ్నకు ఇద్దరికీ సమాన ఓట్లు రావడం విశేషం. ఇమ్మిగ్రేషన్ సమస్యను హారిస్ కంటే ట్రంప్ మెరుగ్గా నిర్వహిస్తారని కొందరు తెలిపారు.
అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ప్రజలు తమ నిత్యావసరాల ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు కమల, ట్రంప్‌లకు దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దడంపై విభిన్న ఆలోచనలు ఉన్నాయి. కమలా హారిస్ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. అయితే ట్రంప్ తమ ప్రణాళికల కోసం అవసరమైతే అప్పు చేసైనా ఆ ఖర్చును భర్తీ చేస్తామని చెబుతున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. దీంతో వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. నవంబర్ 5న జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: తైవాన్ విషయంలో చైనాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment