జిల్లా పశుసంవర్దకశాఖ కార్యాలయం
కైలాస్‌నగర్: పశుసంవర్ధకశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొల్ల, కుర్మలకు అందించే పథకాలు, రాయితీ యూనిట్లు, గొర్రెలు, బర్రెలు, పశువులు వంటి ప్రయోజనాలు పొందాలంటే ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ సభ్యులై ఉండాలి. ఈ సంఘాల్లో సభ్యులైన వారికే ప్రభుత్వపరంగా అందించే ప్రయోజనాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. ఇంతటి కీలకమైన ఈ సంఘాల జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తాలేకుండా పోయాయి. మండల సంఘాల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం,
వాటిి నిర్వహణపై జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం జరగక గొల్ల, కుర్మలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
ఐదేళ్లుగా పత్తాలేని అధ్యక్ష ఎన్నికలు
జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తా లేకుండాపోయాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన రెంకల హన్మండ్లు యాదవ్ పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఈ పదవికి ఎన్నికలు నిర్వహించ లేదు. నిబంధనల ప్రకారం 70సొసైటీల మండల అధ్యక్షులు ఎన్నికై తే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించవచ్చనేది అధికారులే చెబుతున్నారు.
కానీ ఇప్పటి వరకు ఆ దిశగా కసరత్తు చేయడం లేదు. జిల్లాలో 97 సొసైటీలకు అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ఇప్పటికే సగం గడిచిపోయింది. అయితే జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. అధ్యక్షుడు ఉన్నట్లేతే గొల్ల, కుర్మల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపే అవకాశముంటుందని కులస్తులు చెబుతున్నారు.
ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
మండల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్లు గడుస్తు న్నా ఇంకా జిల్లా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఓ వైపు పదవీ కాలం ముగిసేదశకు వస్తున్నా ఎ ప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. గొ ల్ల, కుర్మలు ఏవైనా సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరిని కలువాలో తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. – మేకల రవికాంత్, తలమడుగు సొసైటీ అధ్యక్షుడు
మండలస్థాయి ఎన్నికలు పూర్తికాలేదు
అన్ని మండలాల్లో ఈ సొసైటీ అధ్యక్ష ఎన్నికలు ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో 97 మాత్రమే పూర్తయ్యాయి. ఓటరు జాబితా తయారీ కోసం మిగతా సంఘాల సభ్యుల ఆధార్ వివరాలు కో రుతున్నాం. కానీ వారు స్పందించట్లేదు. పూర్తి వివరాలు అందిన వెంటనే ఓటరు జాబితా సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖకు పంపిస్తాం.
– కిషన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment