దేశంలో లోక్‌సభ ఎన్నికలకు జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే దేశంలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు దేశరాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. అత్యధిక ఓటర్లతో పాటు వివిధ అంశాలు ఆయా నియోజకవర్గాలను అగ్రస్థానంలో నిలిపివుంచుతున్నాయి. ఈ జాబితాలోని ప్రముఖ నియోజకవర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మల్కాజిగిరి, తెలంగాణ
ఓటర్ల సంఖ్య: సుమారు 31,50,303.
తెలంగాణలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఓటరు జనాభా పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్‌గిరి. తెలంగాణలో జనాభా వైవిధ్యానికి ఈ ప్రాంతం నిలయంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రాముఖ్యతను ఈ నియోజకవర్గం ప్రతిబింబిస్తుంది. నేతలందరూ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గత ఎన్నికల్లో మాల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.
అవుటర్ ఢిల్లీ, ఢిల్లీ
ఓటర్ల సంఖ్య: సుమారు 25 లక్షలు.
ఔటర్ ఢిల్లీ.. జనాభా పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ద్వారక, నజఫ్‌గఢ్, ముండ్కా తదితర ప్రాంతాలు దీనిలో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ జనాభా కలయికతో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల సమయంలో అధిక ఓటింగ్ శాతాన్ని స్థిరంగా నమోదు చేస్తూ వస్తోంది.
ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
ఓటర్ల సంఖ్య: సుమారు 23 లక్షలు.
జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో ఉన్న ఘజియాబాద్, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధికి ఉదాహరణగా నిలిచింది. ఇది ఓటర్ల సంఖ్య పెరిగేందుకు దారితీసింది. పట్టణ, గ్రామీణ జనాభా ఇక్కడ అత్యధికం. దేశ రాజకీయాలకు కీలక నియోజకవర్గంగా ఘజియాబాద్ అవతరించింది.
బెంగళూరు సౌత్, కర్ణాటక
ఓటర్ల సంఖ్య: సుమారు 20 లక్షలు.
భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని సౌత్ బెంగళూరులో జయనగర్, బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీలాంటి ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. గణనీయమైన సంఖ్యలో ఇక్కడ ఓటర్లు ఉన్నారు. కర్ణాటక రాజకీయాలకు ఈ నియోజనవర్గం కేంద్ర బిందువుగా ఉంది. అలాగే దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంటుంది.
ముంబయి నార్త్, మహారాష్ట్ర
ఓటర్ల సంఖ్య: సుమారు 18 లక్షలు.
ముంబై నార్త్ 18 లక్షల జనాభా కలిగిన లోక్‌సభ నియోజకవర్గం. మలాడ్, కండివాలి, బోరివలి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉన్నత వర్గాల నుండి అట్టడుగు వర్గాల ప్రజలకు నిలయంగా ఈ నియోజకవర్గం ఉంది. భారతదేశ ఆర్థిక చిత్రాన్ని చూపించే ఈ నియోజనవర్గం దేశరాజకీయాల్లో కీలకంగా కనిపిస్తుంది.
నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ
ఓటర్ల సంఖ్య: సుమారు 17 లక్షలు.
ఈశాన్య ఢిల్లీలో షహదారా, సీలంపూర్, యమునా విహార్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇది జాతీయ రాజధానిలో సామాజిక,ఆర్థిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ నేపథ్యాలు కలిగిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడున్నారు.
చాందినీ చౌక్, ఢిల్లీ
ఓటర్ల సంఖ్య: సుమారు 16 లక్షలు.
చాందినీ చౌక్.. ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. సందడిగా ఉండే మార్కెట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఢిల్లీలో ఇది ఒక ప్రధాన లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ పాత ఢిల్లీ, దర్యాగంజ్, చాందినీ చౌక్ తదితర ప్రాంతాలున్నాయి. విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాల ఓటర్లు ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు.
నార్త్ వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ
ఓటర్ల సంఖ్య: 15 లక్షలు.
వాయువ్య ఢిల్లీలో రోహిణి, నరేలా, కిరారి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకవైపు విశాలమైన పట్టణ ప్రాంతం, మరోవైపు గ్రామీణ ప్రాంతం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఢిల్లీ ఓటర్లలో అత్యధికులు ఈ ప్రాంతంలోనే కనిపిస్తారు. ఇది దేశ రాజధానిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది.
తిరువనంతపురం, కేరళ
ఓటర్ల సంఖ్య: సుమారు 14 లక్షలు.
కేరళ రాజధాని తిరువనంతపురం రాజకీయంగా అవగాహన కలిగిన జనాభాకు నిలయంగా ఉంది. ఇక్కడి ఓటర్లు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం కనిపిస్తుంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. గణనీయసంఖ్యలో ఇక్కడున్న ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటారు.
పుణె, మహారాష్ట్ర
ఓటర్ల సంఖ్య: 13 లక్షలు.
పూణే ప్రాంతం విద్యా సంస్థలతో పాటు సాంస్కృతిక కేంద్రాలకు నిలయంగా ఉంది. శివాజీనగర్, కోత్రుడ్, హడప్సర్ తదితర పేరొందిన ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనే యువకులు, విద్యావంతులైన ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
లక్నో, ఉత్తరప్రదేశ్
ఓటర్ల సంఖ్య: దాదాపు 12 లక్షలు
లక్నో.. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం. దేశంలో రాజకీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఎన్నికల సమయంలో గణనీయమైన ఓటింగ్ నమోదవుతుంటుంది. హజ్రత్‌గంజ్, అలంబాగ్, గోమతి నగర్ తదితర ప్రాంతాలు ఇక్కడున్నాయి. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
దేశంలోని ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో కీలకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు క్రియాశీల రాజకీయ భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment