Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు | Telangana Voter List: More Than 90 Lakh Voters in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు

Published Fri, Jan 6 2023 6:29 PM | Last Updated on Fri, Jan 6 2023 6:29 PM

Telangana Voter List: More Than 90 Lakh Voters in Greater Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 6,12,700 ఓటర్లుండగా, చార్మినార్‌లో అత్యల్పంగా 2,14,774 ఓటర్లున్నారు. 

హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మేడ్చల్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 91,86,375 మంది ఓటర్లు ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో కొంతభాగం మాత్రమే ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌ జిల్లాలో ముసాయిదా జాబితాలో 41.46 లక్షల ఓటర్లుండగా, తుదిజాబితాలో ఆ సంఖ్య 42.15 లక్షలకు పెరిగింది. ఓట్లు గల్లంతయిన వారితోపాటు కొత్త ఓటర్ల నమోదుతో ఈ సంఖ్య పెరిగింది. (క్లిక్ చేయండి: మెట్రో ఛార్జీలు పెంపు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement