
ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: ‘అధికారంలో ఎవరుంటే మీకు మంచి జరిగిందో.. ఎవరుంటే ఈ మంచి కొనసాగుతుందో అనే విషయాన్ని ఆలోచించి.. కుటుంబసభ్యులందరితో కలిసి మాట్లాడుకొని ఓటు వేయండి’ అని ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో ఒక వీడియో పోస్టు చేశారు. ‘ఓటర్లకు ఒక్కటే ఒకటి అప్పీల్ చేస్తున్నా.
గతంలో నాకు ఓటు వేయని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటు వేయకపోవటానికి వారికి రకరకాల కారణాలు ఉండవచ్చు. కులం కావచ్చు.. వాళ్లకున్న పారీ్టల అఫిలియేషన్ కావచ్చు. ఏమైనా కారణాలు కావచ్చు. వాళ్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే. ఒక్కసారి ఇంటికి వెళ్లి మీ భార్యతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉండే అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా మాట్లాడండి.
చిన్న పిల్లలు కదా.. ఓటు లేదు కదా.. అని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో కూడా మాట్లాడండి. అందరితో మాట్లాడి.. ఎవ్వరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవ్వరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది? అనే ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేదిగా ఆలోచన చేసి ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.
ప్రలోభాలకు లొంగకండి
⇒ టీడీపీ కూటమి డబ్బులిచ్చినా.. ఓటు మాత్రం మనకే వేయండి
⇒ ప్రతి ఓటూ ముఖ్యమే... రెండు బటన్లూ ఫ్యాన్ గుర్తుపైనే నొక్కండి
⇒ ఓటర్లకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వినతి
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రలోభాలకు లొంగకండి.. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి జరిగిన మంచిని కొలమానంగా తీసుకోండి. తెలుగుదేశం కూటమి మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తుంది. డబ్బులూ ఇస్తారు. డబ్బులు తీసుకున్నా... ఓటు మాత్రం మీకు మంచి చేసిన మీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించండి అని ఓటర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యరి్థంచారు.
రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నుంచి దోచేసిన డబ్బులు మనవేనని.. ప్రలోభపెట్టేందుకు ఆ నోట్ల కట్టలిస్తారని చెప్పారు. తీసుకున్నా... ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి.. మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment