అభిప్రాయం
నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలు స్తారనే ఉత్కంఠతో ప్రపంచ రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే విషయంపైననే జయాపజయాలు ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవంగా ఎన్నికల సర్వేలన్నీ కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు అక్టోబర్ చివరి వరకు తెలియ జేశాయి. విశ్లేష ణాత్మకంగా చూస్తే– ఓటు హక్కును వినియోగించుకోవడంలో రిపబ్లికన్ ఓటర్లు ముందు ఉంటా రని, డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు వెనుకంచెలో ఉంటారని ఒక అపవాదు ఉంది. ఈ అపవాదు నిజమైతే, ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సులభమే.
అరబ్ అమెరికన్ ఓటర్లు సహజంగా డెమో క్రటిక్ పార్టీ వైపు ఉంటారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలస్తీ నాలో జరుగుతున్న ముస్లింల నరమేధాన్ని డెమోక్రాట్లు ఆపలేకపోయారనీ, పైగా దీనికి కారణమైన ఇజ్రా యెల్‌ను బహిరంగంగా బైడెన్ ప్రభుత్వం సమర్థించిందనీ, ఆర్థిక సైనిక సహకారం అందించిందనీ, అరబ్ అమెరికన్ ఓటర్లు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాము డెమోక్రాట్లను నమ్ముకున్నందుకు నట్టేట మునిగి పోయామని అరబ్ అమెరికన్ హక్కుల లీగ్ చైర్మన్ నహబ్ అయద్ పత్రికల ముందు వాపోవడం ఇక్కడ గమనార్హం. డెమో క్రటిక్ పార్టీ తరపున ఎన్నికైన కొందరు ముస్లిం మేయర్లు ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా ఇక్కడ గమనార్హం.
పైగా కమలా హ్యారిస్ భారతీయ (హిందూ) మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు ముస్లింలు ఓట్లు వేయరాదని కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు పిలుపునివ్వడం డెమోక్రాట్లకు కొంత నష్టమే. వాస్తవంగా కమలా హ్యారిస్‌కు, ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌కు భారతీయ ఆధ్యాత్మిక విషయాలపై, భారతీయ సంస్కృతిపై, భారతీయ మేథో సంపత్తిపై సదభి ప్రాయం లేదంటారు. ఈ విషయం భారతీయ అమెరికన్ ఓటర్లకు బాగా తెలుసు.
ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిపిన అమానుష దాడులను బహిరంగంగా ఖండించడం, భారతీ యులు తనకు అత్యంత ప్రియ మిత్రులని గతంలో అనేకమార్లు ఆయన ప్రకటించడం, అమె రికాలోని హిందూ ఓటర్ల మనోభావాలను ప్రభా వితం చేస్తుందని చెప్పవచ్చు.
అక్రమ వలసలను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కమలా హ్యారిస్ కంటే ట్రంప్ ముందు ఉంటాడని మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. ఇదే సందర్భంలో హెచ్ వన్ వీసాల విడుదలలో నియమాలు కఠినతరం చేస్తే, కొంత మంది భారతీయులు ఇబ్బంది పడతారనీ, ఈ విషయంలో కమలా హ్యారిస్ ఆలోచన ధోరణి తమకు ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఓటర్లను గోడమీద పిల్లులు అని అంటారు. చివరి నిమిషంలో వీరి ఆలోచన మారితే జయాపజ యాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది.
ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య ఉష తెలుగింటి ఆడపడుచు కావడం, అమెరికాలోని ముఖ్యమైన అధికా రులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం, భారతీయ అమెరికన్ ఓటర్లతో ఆమె అనేక సమా వేశాలు నిర్వహించడం, ట్రంప్ విజయానికి కొంత కలిసి వచ్చే విషయమే. ఇక ఆఫ్రికన్ యూరోపి యన్ ఓటర్లు ఇరుపార్టీలకూ సమంగా ఉన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
ఉల్లి బాలరంగయ్య
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment