చండీగఢ్: పంజాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్‌సర్‌కు తరలించారు.
గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
Comments
Please login to add a commentAdd a comment