ఎన్నికలకు నోచుకోని
12 నగర, పురపాలికలు
హైకోర్టు ఆదేశాలతో
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అనివార్యం
మిగతా మునిసిపాలిటీలకు
సన్నద్ధం కాని సర్కారు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) తరహాలోనే రాష్ట్రంలో మరో 11 నగర, పురపాలక సంఘాలు ఎన్నికలకు నోచుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశంపై ఇప్పటికే పలుమార్లు హైకోరు ్ట ఆగ్రహానికి గురైన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణ కోసం డిసెంబర్ 15 వరకు గడువు కోరింది. మిగిలిన 11 పురపాలికల ఊసెత్తడం లేదు. ఎన్నికలు జరగని కారణంగా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో తాగునీటితో పాటు ఇతర ప్రజాసమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో సమీప భవిష్యత్తు లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశముందని అధికారపార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐదు చోట్ల లైన్ క్లియర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98 పురపాలికల పాలకవర్గాల గడువు 2010 అక్టోబర్‌లో ముగిసిపోగా.. గత ప్రభుత్వాల వైఖరి కారణంగా ఎన్నికలు 2014 మార్చి నెలలో జరిగాయి. ఎట్టకేలకు నాలుగేళ్ల గడువు తర్వాత తెలంగాణ పరిధిలోని 3 మునిసిపల్ కార్పొరేషన్లు, 53 మునిసిపాలిటీలకు అప్పట్లో ఎన్నికలు నిర్వహించారు. న్యాయపరమైన అడ్డంకుల వల్ల వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలు, సిద్దిపేట, దుబ్బాక, కొల్లాపూర్, అచ్చంపేట, మేడ్చె ల్ స్థానాలకు ఎన్నికలు వాయిదా వేశారు.
వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, కొల్లాపూర్‌లకు న్యాయపర చిక్కులు తొలగిపోయాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల డివి జన్ల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి వెళ్లినా ఇంకా ఆమోదముద్ర పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జీహెచ్‌ఎంసీతో పాటే ఈ ఐదు నగరాలు, పట్టణాల్లో వచ్చే ఏడాదిలోగా కొత్త పాల కవర్గాలు ఏర్పడే అవకాశముంది. నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరపాలని పురపాలక శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన, జరగాల్సిన మునిసిపాలిటీలకు సం బంధించిన వివరాలను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖను కోరింది. కొత్తగా ఏర్పడిన బాదెపల్లి నగర పంచాయతీకి ఎన్నికలు ఆల స్యం కానున్నాయి. పార్లమెంటులో ఏపీ ముని సిపల్ చట్ట సవరణ జరిగితేనే షెడ్యూల్డ్ ఏరియా పరిధి లోని మణుగూరు, మందమర్రి, పాల్వంచల మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి.
‘పుర’... పాలన శూన్యం
Published Mon, May 4 2015 2:19 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement