అవినీతి రహిత పాలన అందించాలి | Chukka Ramaiah talks about new districts | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత పాలన అందించాలి

Published Thu, Oct 6 2016 4:22 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

Chukka Ramaiah talks about new districts

• మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య

తొర్రూరు: ప్రజల సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా అవినీతి రహిత పాలనను అందించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా తొర్రూరులో విలేకరులతో మాట్లాడారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన అన్నివర్గాల ప్రజలకు తక్కువ సమయంలో అందించే అవకాశం ఉంటుందని, అయితే ప్రజలను యాచకులని అనుకోకుండా ప్రభుత్వ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా పరిపాలన ఉండాలని సూచించారు.

అప్పుడే చిన్న జిల్లాలతో ఫలితాలు వస్తాయన్నారు. విద్యా వ్యవస్థలో కుడా అనేక మార్పులు తీసుకొచ్చి  రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఉంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement