రెండు భవనాలు.. మధ్యలో ప్లాట్‌ఫామ్స్‌  | Secunderabad Railway Station To Construct Similar To Airport | Sakshi
Sakshi News home page

రెండు భవనాలు.. మధ్యలో ప్లాట్‌ఫామ్స్‌ 

Published Sun, Jun 12 2022 2:21 AM | Last Updated on Sun, Jun 12 2022 2:52 PM

Secunderabad Railway Station To Construct Similar To Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేసేందుకు తొలి అడుగు పడింది. దాదాపు రూ.50 వేల కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 123 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునర్నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. రూ.653 కోట్ల అంచనా వ్యయంతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనుంది.

జూలై 29న టెండర్‌ గడువు ముగుస్తుంది. ఈపీసీ విధానం తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఈనెల 21న ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 36 నెలల్లో ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేళ్ల కిందటే ఈ ప్రాజెక్టు ఆలోచనకు శ్రీకారం చుట్టినా అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. 

స్వరూపం ఇలా..
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ నం.1 వైపు ఉన్న దక్షిణ భాగం భవన స్థానంలో జీప్లస్‌ 3 అంతస్తులతో భారీ భవనాన్ని నిర్మిస్తారు. దీని వైశాల్యం 14,792 చ.మీ. ఉంటుంది. ప్రస్తుతం ముందువైపు ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని కలుపుకొని    
ఈ భవనం నిర్మిస్తారు. 
ఈ భవనానికి అనుసంధానంగా భూగర్భ పా ర్కింగ్‌ అందుబాటులోకి వస్తుంది. అది కూడా లెవల్‌ వన్, టూ.. ఇలా ఉంటుంది. దాదాపు 2 వేల వాహనాలు నిలిపే అవకాశం ఉంటుంది. 
పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ఉంటే ఉత్తర భాగం వైపు జీప్లస్‌ 3 అంతస్తుల భవనం నిర్మిస్తారు. ఇది 22,516 చ.మీ. వైశాల్యంతో ఉంటుంది. 
ఈ బ్లాక్‌ను అనుసంధానం చేసుకుని ఐదు లెవెల్స్‌తో మల్టీ లెవల్‌    మిగతా 0వ పేజీలో u
 పార్కింగ్‌ యార్డు నిర్మిస్తారు. అక్కడ మూడు వేల వరకు వాహనాలు నిలిపేందుకు వీలుంటుంది. 
108 మీటర్ల వెడల్పుతో ఉండే రెండు అంతస్తుల్లో ఉండే స్కై కాన్‌కోర్సును నిర్మిస్తారు. మొదటి అంతస్తు ప్రయాణికుల వినియోగానికి, రెండోది వాణిజ్య విభాగానికి వచ్చే ప్రజలు రూఫ్‌ టాప్‌ ప్లాజాగా వాడేందుకు అందుబాటులో ఉంటుంది. 24,604 చదరపు మీటర్ల ఫ్లోర్‌స్పేస్‌ అందులో ఉంటుంది. 
ప్లాట్‌ఫామ్స్‌ను పూర్తిస్థాయిలో అధునికీకరిస్తారు. ఇవి పైకప్పు దిగువన, భవనం అంతర్భాగంలో ఉంటాయి. 
రెండు బ్లాకులను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్‌ (ఆటో వాకింగ్‌) వసతితో రెండు 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వాక్‌వేస్‌ ఉంటాయి. రైలు ఎక్కేందుకు వెళ్లేవారు, దిగి వచ్చే వారికి వేర్వేరు దారులుంటాయి. 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రెండు వైపులా.. అంటే తూర్పు, పశ్చిమ వైపు ఉండే మెట్రో స్టేషన్లతో స్కైవేలతో అనుసంధానిస్తారు. 
స్టేషన్‌ ప్రాంగణానికి అవసరమైన విద్యుత్‌ కోసం 5 వేల కేవీపీ సామర్ధ్యంతో సోలార్‌ ప్లాంట్‌ నిర్మిస్తారు. 
భవనంలో 20కిపైగా లిఫ్టులు, మరో 20 వరకు ఎస్కలేటర్లు ఉంటాయి. 

ఆర్భాటాలకు కొంత దూరంగా...
రైల్వే స్టేషన్‌తోపాటు భారీ వాణిజ్యసముదాయంగా స్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్నది పాతప్లాన్‌. ఇప్పుడు ఆ ఆర్భాటాలకు కొంత దూరంగా దీన్ని చేపడుతున్నారు. ఈ భవనంలో రైల్వే స్టేషన్, సంబంధిత కార్యాలయాలు కాకుండా.. పరిమితంగా వాణిజ్య కేంద్రాలుంటాయి. షాపింగ్‌మాల్, రెస్టారెంట్లు ఉంటాయి. పూర్తి ప్రణాళిక వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement