గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. సికింద్రాబాద్–వాస్కోడిగామా–సికింద్రాబాద్ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రెలు ఈ నెల 6న ప్రారంభం కానున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సేవలు మొదలవుతున్నాయని పేర్కొంది. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతి బుధవారం, శుక్రవారాలు అందుబాటులో ఉంటుందని.. వాస్కోడిగామా – సికింద్రాబాద్ (17040) రైలు గురువారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది.
సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు 17039 నంబర్‌తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు 17040 నంబర్‌తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది
Comments
Please login to add a commentAdd a comment