పండుగ సీజన్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగడంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సులకు వెళ్దామని భావించిన చాలా మందికి ఆర్టీసీ కార్మికుల సమ్మె షాకిచ్చింది. దీంతో చేసేది ఏమి లేక చాలా మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.