అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, సికింద్రాబాద్‌లో వేల సంఖ‍్యలో ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్‌పై 200 మంది ఆందోళనకారులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. ‘‘ఆందోళనలు చేసి వెళ్లిపోదాం అనుకున్నాము. మాపై కాల్పులు ఎందుకు జరిపారు. 10 మంది కాదు అందరం చర్చకు వస్తాము. చావడానికైనా సిద్దం.. ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేంద్రం హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని’’ తేల్చి చెప్పారు.
దీంతో రెండు వైపులా పోలీసులు భారీ మోహరించారు. ఆందోళనకారులను పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, తమ డిమాండ్లను పరిష‍్కరించే వరకు కదిలేది లేదని యువకులు తేల్చి చెప్పారు. మరోవైపు.. ధ్వంసమైన రైళ్లను రైల్వే సిబ్బంది తరలిస్తున్నారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన ఫ్లాట్‌ఫామ్‌ల్లో మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే సిబ్బంది.. టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించారు. సాయంత్రంలోగా ట్రైన్ సర్వీసులకు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. రైల్వే ప్రయాణికుల కోసం అధికారులు హెల్ప్ లైన్ నంబర్‌ను కేటాయించారు. రైళ్ల రద్దు, మళ్లింపు వివరాలకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్ 040-2778666 కు కాల్ చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: పది మందిని చర్చలకు పిలిచిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment