
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో రైల్వే పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఏ2 నుంచి ఏ12 వరకు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ‘రైల్వే స్టేషన్ బ్లాక్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్‌గా గుర్తించారు. రమేష్‌ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.
చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
డిఫెన్స్ కోచింగ్‌సెంటర్లే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో సాయి అకాడమీ సుబ్బారావు పేరు కనిపించలేదు. ఈ నెల 17న మధ్యాహ్నం 12:10కి స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ వాట్సాప్ గ్రూప్‌లో 500 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 56 మందిని రైల్వే పోలీసులు చేర్చారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment