న్యూఢిల్లీ: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ విధ్వంసంపై వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. ఈ ఆందోళనలు కొన్ని రాజకీయ పార్టీల అండతోనే విధ్వంసం జరిగిందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
చదవండి: (అగ్నిగుండంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్)
కామారెడ్డి: ఆర్మీస్టూడెంట్స్ ముసుగులో కొంత మంది వ్యక్తులు వచ్చి రైళ్లు దగ్దం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 'ఈ విధ్వంసం ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి జరిపించింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంత జరిగినా నీ ఇంటెలిజెన్స్ ఏమైంది?. అందుకే రాష్ట్రంలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి. ఆర్మీ విద్యార్థులకు ఈ ఘటనతో ఏం సంబంధం లేదు. మోడీ మీకు అన్యాయం చేసే వ్యక్తి కాదు. మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తారు. ఏ విధ్వంసం జరిగినా విద్యార్థులు వెళ్లొద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు దృష్టి మరల్చేందుకే ఈ ఘటనలు అని' బండి సంజయ్ అన్నారు.
చదవండి: (Agnipath Protest: అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment