సాక్షి, హైదరాబాద్: ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని ట్వీట్ చేశారు.
ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని, పాత విధానాన్నే కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. (క్లిక్: మాకు సంబంధం లేదు.. ఖండిస్తున్నాం)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం.
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2022
మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం,పాత విధానాన్నే కొనసాగించాలి. pic.twitter.com/DotzZcpXCL
Comments
Please login to add a commentAdd a comment