Delhi High Court dismisses plea against Agnipath scheme - Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌ను సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత

Published Mon, Feb 27 2023 11:41 AM | Last Updated on Mon, Feb 27 2023 12:03 PM

Delhi HC Dismisses All Petitions Against Agnipath Scheme - Sakshi

ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్నిపథ్‌ పథకాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో అగ్నిపథ్‌ను సవాల్‌ చేస్తూ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 

ఈ సందర్భంగా అగ్నిపథ్‌ స్కీమ్‌ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదిక కేంద్రం తీసుకున్న విధానమని హైకోర్టు పేర్కొంది. అయితే, 2019 అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వాదనల అనంతరం.. హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement