అగ్నిపథ్‌పై నిరసనలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన | Rajnath Singh Key Comments On Agnipath | Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌పై నిరసనలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన

Published Fri, Jun 17 2022 3:27 PM | Last Updated on Fri, Jun 17 2022 3:27 PM

Rajnath Singh Key Comments On Agnipath - Sakshi

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల సందర్భంగా రైల్వే పోలీసుల కాల్పుల్లో నిరసనకారులు గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా లేదు.  గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నాం. రేండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్స్‌ జరుగనందునే ఈ మినహాయింపు ఇస్తున్నాము. యువతను రక్షణరంగంలోకి తీసుకెళ్లే అద్భుత పథకం అగ్నిపథ్‌.  దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత మాతకు సేవ చేసేందుకు ఇదో సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలి’’ అని సూచించారు. 

ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌కు పోటెత్తడంతో.. తీవ్ర ఉద్రిక్త  వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు.. నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అటు బీహార్‌లో సైతం నిరసనలు హింసాత్మకంగా మారాయి. 

ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement