సాత్విక్ , ప్రవీణ్‌చంద్
అమలాపురం టౌన్: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ కాగా మరొకరు ఐఏఎస్ అధికారి, అనంతపురం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకుని కాకినాడ సర్వజనాసుపత్రి కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న గోకరకొండ సూర్య సాయి ప్రవీణ్‌చంద్. అమలాపురంలో కోవిడ్ బారిన పడి అవస్థలు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు సాత్విక్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని తన తండ్రి కాశీ విశ్వనాథ్‌కు అందించారు.
ఒక్కో కోవిడ్ బాధిత జర్నలిస్ట్ కుటుంబానికి రూ.5 వేల సాయం అందించాలని కోరారు. ఈ బాధ్యతను అమలాపురంలోని తన మిత్రుడు నల్లా శివకు అప్పగించారు. అలాగే, ప్రవీణ్‌చంద్ జిల్లాలోని పలు ఆస్పత్రులకు ఏసీటీ గ్రాంట్ సంస్థ సహకారంతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు సమకూర్చుతున్నారు. తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ఆస్పత్రులకు 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment