ఉలిక్కిపడ్డ కోనసీమ
-
తాడికోన ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎగదన్నుతున్న గ్యాస్
-
మళ్లీ బ్లో అవుట్ తప్పదేమోనని ప్రజల ఆందోళన
-
అస్సాంకు చెందిన ఓఎన్జీసీ ఉద్యోగికి తీవ్ర గాయాలు
-
ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన 200 ఇళ్లు
-
పొరగు గ్రామాల్లో పునరావసం
-
గ్యాస్ అదుపునకు ఓఎన్జీసీ నిపుణుల బృందం విశ్వ ప్రయత్నం
-
శనివారం ఉదయానికి అదుపులోకి వచ్చే అవకాశం
అమలాపురం టౌన్/అమలాపురం రూరల్:
కోనసీమ ప్రజలు శుక్రవారం సాయంత్రం మరోసారి ఉలిక్కి పడ్డారు. అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీకి చెందిన ఎస్‌ఆర్–ఎసీ అనే పాత రిగ్ నుంచి ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి, పెద్ద శబ్దంతో గ్యాస్ ఎగదన్నటంతో అల్లవరం మండల ప్రజలు భయకంపితులయ్యారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆ రిగ్‌ను రీ ఢ్రిల్లింగ్ చేయటం కోసం ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది పనులు మొదలు పెట్టారు. అప్పుడు కొద్దిగా గ్యాస్ లీక్ అవటంతో సిబ్బంది అప్రమత్తమై అరికట్టారు. ఈ సమయంలోనే అస్సాంకు చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి సయ్యద్ అన్సాల్ అక్ (39) తీవ్రగాయాలపాలయ్యాడు. గ్యాస్ ఒత్తిడి, శబ్దానికి అతను షాక్‌కు గురయ్యాడు. అమలాపురం కిమ్స్ అస్పత్రికి తక్షణమే తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతను శుక్రవారం రాత్రికి కూడా కోమాలోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. రిగ్‌కు రీ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఎయిర్ హౌస్ అనే పరికరం పగిలి గ్యాస్ కిక్ (ఎగదన్నటం) ఇవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు గ్యాస్ ఒత్తడి. శబ్దం తీవ్రత పెరగటంతో ఓఎన్జీసీ కూడా ప్రమాద సంకేతాలను గమనించి నర్సాపురం, రాజమహేంద్రవరం నుంచి నిపుణుల బృందాలను యుద్ధప్రాతిపదికన రంగంలోకి దింపింది. యాంటీ బ్లో అవుట్ నిపుణుల బృందం రాత్రి పది గంటల వరకూ గ్యాస్ అదుపునకు శ్రమించినా ఫలితం కనిపించలేదు. శనివారం ఉదయానికి గ్యాస్ అదపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది అగ్ని మాపక శకటాలు, చమురు సంస్థలకు చెందిన ఆరు అగ్ని మాపక శకటాలు నిరంతరాయంగా నీరు వెదజల్లుతునే ఉన్నాయి.
రక్షణ వలయంలో తాడికోన...
ముందు జాగ్రత్త చర్యగా రిగ్‌కు 500 మీటర్ల దూరం వరకూ ఎవరూ ఉండ వద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆర్డీవో గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య రంగంలోకి దిగి తాడికోనలో 200 ఇళ్లను ఖాళీ చేయించారు. దాదాపు 500 మంది బా«ధితులను పక్క గ్రామమైన గూడాలలోని పాఠశాల, పంచాయతీ భననాలతోపాట గ్రామ పెద్ద పోలిశెట్టి భాస్కరరావు ఇంట్లోకి తరలించి పునరావసం కల్పించి భోజన వసతి కల్పించారు. ఫోటోలు తీస్తే ఫ్లాష్ వల్ల గ్యాస్ రగిలే అవకాశం ఉన్న దృష్ట్యా సెల్ ఫోన్లను కూడా వినయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాస్ అదపులోకి రాకపోతే 1995లో ఇదే మండలం దేవరలంకలో బ్లో అవుట్ జరిగినప్పుడు ముందు గ్యాస్‌ను పూర్తిగా మండించి వెల్‌క్యాప్ వేయటం ద్వారా అదపు చేశారు. ఆ ప్రక్రియలోనే ఈ గ్యాస్‌ను అదపు చేద్దామా? అనే ఆలోచనలో ఓఎన్జీసీ అధికారులు ఉన్నట్లు తెలిసింది.
ముందే చెప్పాం.. స్పందించలేదు... గ్రామస్తుల ధర్నా
ఉదయమే రిగ్ వద్ద గ్యాస్ లీకయింది. కంగారు పడ్డాం. అప్పుడే రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్లు చేశాం. ఓఎన్జీసీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎవరూ స్పందించిలేదంటూ తాడికోన గ్రామస్తులు రిగ్ వద్ద ధర్నా చేశారు. తాడికోన సర్పంచి దాసరి సంజీవరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన తెలిపారు. రూరల్ సీఐ దేవకుమార్, అల్లవరం తహసీల్దార్ పాము సుబ్బారావు, అల్లవరం ఎస్సై డి.ప్రశాంతకుమాÆŠఅ క్కడి పరిస్థితి సమీక్షించి ఉన్నతాధికారులు నివేదిస్తున్నారు.
అదుపు చేస్తున్నారు...ఆందోళన వద్దు: ఉప ముఖ్యమంత్రి రాజప్ప
తాడికోనలో గ్యాస్‌ను ఓఎన్జీసీ నిపుణులు అదపు చేస్తున్నారు. శనివారం ఉదయం కల్లా అదుపులోకి వస్తుందని ఎవరూ ఆందోళన చెందనవసం లేదని ఉప ముఖ్యమంత్రి రాజప్ప కోనసీమ ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల్లో రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావులు తక్షణమే స్పందించి ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఎసెట్ మేనేజన్ సన్యాల్, ఆర్డీవో గణేష్‌కుమార్‌తో ఫోన్లతో మాట్లాడి ముందు జాగ్రత్తగా పునరావస చర్యలకు ఆదేశించారు. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఓఎన్జీసీ అధికారులతో ఫోన్‌లో చర్చించారు.