ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుండి గ్యాస్‌ లీకేజీ | ongc gas pipeline leakage again at keshavasasupalem in East Godavari | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుండి గ్యాస్‌ లీకేజీ

Published Tue, May 16 2017 12:15 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

ongc gas pipeline leakage again at keshavasasupalem in East Godavari

సఖినేటిపల్లి: ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుంచి పెద‍్ద ఎత్తున గ్యాస్ లీకేజి సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం పంట చేలలో మంగళవారం భారీ శబ‍్దంతో గ్యాస్‌ పైకి ఎగజిమ‍్మింది. దీంతో చుట్టుపక‍్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం వ‍్యవధిలో ఇదే ప్రాంతంలో గ్యాస్‌ లీకేజి రెండోసారి కావడంతో జనం వణికిపోతున్నారు.

గ్యాస్‌ సరఫరా కోసం వేసిన పైపులు తుప్పు పట్టిపోవడంతో తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పైపులను పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీకేజీని ఆపడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement