కోనసీమకు భారీగా పోలీసు బలగాలు
Published Fri, Nov 11 2016 11:36 PM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM
అమలాపురం టౌన్ :
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న పాదయాత్రకు జిల్లా పోలీసు శాఖ బందోబస్తు పరంగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. అమలాపురం డివిజ¯ŒSకు జిల్లాలోని మిగిలిన పోలీసు డివిజన్ల నుంచి పోలీసు బలగాలను పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తోడు కృష్ణా జిల్లా నుంచి శుక్రవారం కోనసీమకు 500 మంది పోలీసులను ఇక్కడకు రప్పించారు. అమలాపురం డివిజ¯ŒSలోని అయిదు పోలీసు సర్కిళ్లకు సంబంధించి ఒక్కో సర్కిల్‌కు 100 మంది చొప్పున కృష్ణా జిల్లా పోలీసులను బందోబస్తుకు సిద్ధం చేశారు. 16 నుంచి యాత్ర పూర్తయ్యే వరకూ ప్రత్యేక పోలీసు బలగాలను ఇక్కడ మోహరించనున్నారు. కాపు ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మరింత పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Advertisement
Advertisement