కేంద్ర రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు మొదలై అంతే త్వరలో...
కేక్ కట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు
అమలాపురం రూరల్ : కేంద్ర రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు మొదలై అంతే త్వరలో కోనసీమలో రైలు కూత వినిపించనుందని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. రైల్వే లైను శిలాఫలకం వద్ద శుక్రవారం జరిగిన సంబరాల్లో ఆయన కేక్ కట్ చేశారు. 2000 సంవత్సరంలో నాటి ఏన్డీఏ ప్రభుత్వంలో కోనసీమ రైలుకు పునాదిరాయి పడితే, నేడు అదే ప్రభుత్వంలో ఆ రైలు సాకారమవుతోందన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితాబత్తుల అభిషేక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.