
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదైంది. బుధవారం ఉదయం రావుపాలెం జొన్నాడ వద్ద సోము వీర్రాజు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న ఎస్‌ఐని వెనక్కి నెట్టి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు.. సోము వీర్రాజుపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాగా, బుధవారం ఉదయం.. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు.
ఇది కూడా చదవండి: ప్రజలతో మమేకం అయితేనే ప్రజాస్పందన తెలిసేది.. బాబుకి అది తెలీదు
Comments
Please login to add a commentAdd a comment