బొబ్బర్లంక వద్ద స్కవర్ స్లూయిజ్ నుంచి నీరు విడుదల చేసిన అధికారులు
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ ముందు భాగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి గోదావరి హెడ్ వర్క్సు ఎస్‌ఈ ఆర్.కాశీ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో స్కవర్ స్లూయిజ్ గేట్లు ఎత్తి భారీ స్థాయిలో నీటిని నదిలోకి విడుదల చేశారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద సెంట్రల్ డెల్టా స్కవర్ స్లూయిజ్‌కు సంబందించిన గేట్లను మంగళవారం తెరిచారు.
ఏటా ఈ సీజన్‌లో బ్యారేజీకి ఎగువన పేరుకుపోయిన మట్టి, సిల్ట్, చెత్తా చెదారాలను తొలగించడానికి హెడ్ వర్క్సు శాఖ ఈ ఆపరేషన్ నిర్వహించడం అనవాయితీ. దానిలో భాగంగా హెడ్ వర్‌ుక్స అధికారులు బొబ్బర్లంక స్కవర్ స్లూయిజ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎస్‌ఈ కాశీ విశ్వేశ్వరరావు స్కవర్ స్లూయిజ్ ద్వారా 4,800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపారు. దీనివల్ల ఎగువన పేరుకు పోయిన బురద మట్టి ఈ నీటి ప్రవాహం ద్వారా గోదావరి దిగువకు చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ కె. అనంద్‌బాబు, ఏఈలు అద్దంకి సాయిరాం, రేవు సునీల్‌బాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment