05: 30PM
►రాజోలు మండలం మేకలపాలెంలో సీఎం జగన్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను గ్రామస్తులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
04: 10PM
►అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు సీఎం జగన్ చేరుకున్నారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు.
03: 30PM
►కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో రాజోలు మండలం మేకలపాలెంకు వెళ్లనున్నారు. అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు.
02: 30PM
►అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.
12: 58PM
►అరిగెలవారిపేటకు చేరుకున్న సీఎం జగన్
►అరిగెలవారిపేట వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
►అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని సీఎం జగన్ హామీ
12:01PM
►పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
►నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
►సీఎం జగన్ జేబులోంచి పెన్ తీసుకున్న 8 నెలల బాబు
►8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్
►శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను అడిగిన సీఎం జగన్
►కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని అడిగిన సీఎం జగన్
►వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎంకు చెప్పిన వరద బాధితులు
11: 20AM
►ట్రాక్టర్‌లో లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్
11:15AM
►పంటుపై లంక గ్రామాలకు చేరిన సీఎం జగన్
11: 06 AM
►పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్తున్న సీఎం జగన్
10:34 AM
►పి.గన్నవరం మండలం జి. పెదపూడి చేరుకున్న సీఎం జగన్
►జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం
►వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్
9: 45AM
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
► అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు.
► అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.
► అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు.
► అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు.
► అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు.
► రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.
వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. డా.బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment