YS Jagan Konaseema District Tour
-
డ్రామాల్లేవ్.. దిశా నిర్దేశమే
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వనరులను కలెక్టర్ల చేతిలో పెట్టి వారికి దిశా నిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా టీవీల్లో, పత్రికల్లో పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా సీఎం జగన్ నేరుగా బాధితులను కలుసుకుని మాట్లాడారు. సాయం అందలేదని ఒక్కరైనా చెప్పారా బాబూ? ‘చంద్రబాబు ప్రజలకు మేలు జరగకపోయినా ఫర్వాలేదనుకుంటారు. టీవీ, పత్రికలు చేతిలో ఉన్నాయని ప్రచారం చేసుకునే వారు. మన బాబు బంగారం.. బాగా పని చేస్తున్నారంటూ ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేసుకునేవారు. ఇదే పెద్ద మనిషి రెండు రోజుల క్రితం ఇక్కడే (కోనసీమ) తిరిగారు. లంక ప్రాంతాల్లో తమకు సాయం అందలేదన్న వారిని కనీసం ఒక్కరినైనా చూపించలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాళ్లు పని చేయడం లేదు... వీళ్లు పనిచేయడం లేదంటూ సస్పెన్షన్లు, డిస్మిస్లు చేసేవారు. ఆర్భాటం చేసి సొంత మీడియాలో పబ్లిసిటీ చేసుకునేవారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఆపదలో ఆదుకున్నారు
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఏ పూటా ఎలాంటి లోటు రానివ్వలేదు. ముంపులో ఉన్నా అన్నీ అందించారు. మీరందించిన ఈ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ ఇలా మా లంకల్లోకి రాలేదు. 2006లో వైఎస్సార్ మా బాధలు తెలుసుకుని ఇళ్లు ఇస్తే ఆయన బిడ్డగా ఇవాళ కష్టంలో మీరు ఆదుకుంటున్నారు’ అంటూ కోనసీమ లంక గ్రామాల్లో వరద బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో సీఎం జగన్ మంగళవారం విస్తృతంగా పర్యటించి బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపారు. ఊడుమూడిలంకలో... ‘ఈ గ్రామంలో దాదాపు 1,000 మంది నివాసం ఉంటున్నారు. మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీకు అందితే అందాయని, లేకపోతే లేదని చెప్పండి. మీరు చెప్పే దాన్నిబట్టి కలెక్టర్‌కు మార్కులు వేస్తా. ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, కిలో పప్పు, లీటర్ పామాయిల్, లీటర్ పాలు, కేజీ టమోటా, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డలు అందాయా? లేదా?’ అని ప్రశ్నించగా తమకు అన్నీ అందాయని ముక్తకంఠంతో చెప్పారు. ‘మరి కలెక్టర్‌కు మంచి మార్కులు వేయవచ్చా?’ అని సీఎం ప్రశ్నించగా వందకు వంద ఇవ్వాలని ప్రజలు కోరడంతో కలెక్టర్ శుక్లా పనితీరును సీఎం మెచ్చుకున్నారు. అరిగెలవారిపేటలో... తనను కలిసేందుకు స్థానికులంతా ఒకేసారి ముందుకు రావడంతో అభ్యంతరం చెప్పిన భద్రతా సిబ్బందిని సీఎం వారించారు. స్థానికులను పిలిచి వారితో ఆప్యాయంగా సమస్యలను తెలుసుకున్నారు. తమ గ్రామానికి సీఎం రావడం ఇదే తొలిసారి అని, గతంలో ఎవరూ ఇంత దగ్గరగా తమ కష్టాలు తెలుసుకోలేదని బాధితులు పేర్కొన్నారు. వశిష్ట గోదావరి పాయకు వంతెన నిర్మించాలని జి.పెదపూడి లంక వాసులు సీఎం జగన్‌ను కోరారు. గత పాలకులు ఆరుసార్లు టెంకాయ కొట్టినా ఫలితం లేదని నివేదించారు. వంతెన నిర్మాణ బాధ్యత తనదని సీఎం ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బురదలో వెళ్లి గుడిసెలు పరిశీలిస్తూ.. పడిపోయిన తమ గుడిసెలను చూడాలని అరిగెలవారిపేట బాధితులు కోరడంతో సీఎం జగన్ బురద మట్టిలో నడిచి వెళ్లి పరిశీలించారు. వరద సమయంలో ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరిస్తూ అరిగెల మనోరంజని అనే మహిళ ముఖ్యమంత్రి ఎదుట కన్నీటి పర్యంతమైంది. అక్కడే ఉన్న గ్రామ వలంటీర్‌ను అమ్మా కళ్యాణి.. అంటూ దగ్గరకు పిలిచి కొత్త పించన్లు వస్తున్నాయా? అని సీఎం ఆరా తీశారు. దాణా అందిందా? అక్కడి నుంచి ఊడిమూడిలంక చేరుకున్న సీఎం జగన్‌కు చిన్నారులు గులాబీలతో స్వాగతం పలికారు. మీరంతా బాగా చదువుకోవాలమ్మా అంటూ సీఎం వారిని ఆశీర్వదించారు. పాడిరైతులు కుసుమ జేమ్స్, మాతా ఆనందరావు, కుసుమ ధనరాజు, పరమట నాగరాజును సీఎం ఆప్యాయంగా పలకరించి పశువుల దాణా అందిందా? అధికారులు ఎలా చూసుకుంటున్నారు? అని ఆరా తీశారు. వరద సహాయక పశువైద్య శిబిరాన్ని సీఎం సందర్శించి వెటర్నరీ జేడీతో మాట్లాడారు. చిన్నారికి నామకరణం చేసిన సీఎం తమ ఏడు నెలల కుమార్తెకు నామకరణం చేయాలని కుసుమ సంజీవరావు, అనిత దంపతులు కోరడంతో సీఎం జగన్ ఆ చిన్నారిని ఆప్యాయంగా ముద్దాడి తన మాతృమూర్తి విజయమ్మ పేరును పెట్టారు. తన రెండేళ్ల కుమారుడు తరపట్ల గౌతమ్ కుడి చేతికి మూడు వేళ్లతో జన్మించాడని చిన్నారి తండ్రి వెంకట్రావు చెప్పడంతో శస్త్ర చికిత్స చేయిస్తామని సీఎం చెప్పారు. మూడు లంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో బూరుగులంక నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి తమ గ్రామానికి రావాలని కోరడంతో సీఎం అంగీకరించారు. షెడ్యూల్లో లేకున్నా మహిళలతో కలిసి కొబ్బరి తోటల్లోంచి బురద మట్టిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడారు. -
ఇంటింటికీ కాలి నడకన
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా బాధితులను కలుసుకుని భరోసా కల్పించారు. వారి ఇబ్బందులను సావధానంగా ఆలకించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపారు. షెడ్యూల్ ప్రకారం సీఎం మంగళవారం ఉ.10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశాన్నిచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులను చూడగానే ట్రాక్టర్ దిగి.. సీఎం పర్యటన సందర్భంగా జి.పెదపూడిలంకకు ట్రాక్టర్‌పై వెళుతుండగా దారిలో ఉద్యానవన రైతులు పొలాల్లో కుళ్లిపోయిన అరటి, వంగ, మిరప, దొండ, మునగ పంటలతో కనిపించారు. రైతులను చూడగానే ట్రాక్టర్ ఆపాలని ఆదేశించి సీఎం జగన్ కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా రైతుల మధ్యకు వెళ్లి వారు చెప్పింది విన్నారు. అధైర్యపడొద్దు.. ‘గోదావరికి ఆగస్టు 15 తరువాత వరదలు వస్తాయి. ఈసారి నెల రోజులు ముందే రావడంతో చేతికి వచ్చిన పంట కోల్పోయాం’ అని జి.పెదపూడి లంకకు చెందిన రైతులు వారా వెంకట్రావు, చీకురమల్లి సంతోషరావు, పల్లి సత్యనారాయణ, అడ్డాల నరసన్న, దొడ్డా శ్రీనివాస్, కటికిరెడ్డి నాగరాజు సీఎం ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టా. కేవలం రూ.36 వేలు మాత్రమే వచ్చింది. మిగిలిందంతా వరదలో కొట్టుకుపోయింది’ అని కంటతడి పెట్టిన రైతు పల్లి సత్యనారాయణను సీఎం జగన్ ఓదార్చారు. అక్కడే ఉన్న ఉద్యానశాఖ, వ్యవసాయ అధికారులను పంట నష్టంపై ఆరా తీశారు. ‘రైతులు పంట నష్టపోతే ఆదుకోవడంలో మన ప్రభుత్వ స్పందన వేరు. ఏ సీజన్లో నష్టపోతున్నారో అదే సీజన్ ముగిసేలోగా పెట్టుబడి రాయితీఅందజేస్తున్నాం. అధైర్యపడొద్దు. అధికారులు నష్టం అంచనాలు రూపొందిస్తారు. నివేదిక అందాక పెట్టుబడి రాయితీ మీ ఖాతాలకు జమ అవుతుంది’ అని రైతులకు ధైర్యం చెప్పారు. పంటుపై ప్రయాణిస్తూ గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వీధుల్లో కాలి నడకన.. జి.పెదపూడిలంకలో ట్రాక్టర్ దిగి రెండు వీధులు నడుచుకుంటూ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఒక్కరితోనూ కలసిపోయారు. వరదల్లో వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ‘వరద వచ్చినప్పుడు మీ కలెక్టర్ వచ్చారా? అధికారులు వచ్చారా? సాయం అందించారా? పాలు ఇచ్చారా? బియ్యం పంపిణీ చేశారా? పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ప్యాకెట్లు అందించారా? లేదా’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.రెండు వేల సాయం అందిందా? లేదా? అని ఇంటింటికీ వెళ్లి అడిగారు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటికప్పుడే ఆదేశాలు... సీఎం జగన్ కాలి నడకన పర్యటిస్తున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన భర్త మాతా సత్యనారాయణను ఆదుకోవాలని ఓ మహిళ కోరడంతో నేరుగా ఆ ఇంటికి వెళ్లి పలకరించారు. వైద్యానికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మాతా జ్యోతి వేడుకోవడంతో ఆమెను వలంటీర్‌గా నియమించాలని సూచించారు. సీఎం పర్యటన పూర్తయ్యే లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు అందడంతో కృతజ్ఞతలు తెలిపింది. పూరిల్లు వరద నీట మునిగిన బాధితుడు కాకర కృష్ణకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సరెళ్ల సూర్యారావు అనే వృద్ధుడిని వరద సాయంపై సీఎం ఆరా తీయగా.. అన్నీ అందాయి, అందరూ బాగా పని చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. ‘వరద కష్టాల్లో కూడా ఏ పూటా పస్తులు ఉండలేదు. ఏ లోటు రానివ్వకుండా మీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. మనస్ఫూర్తిగా తిన్నాం. మాకు అన్నీ అందాయి. అధికారులు మావద్దకు వచ్చారు’ అని బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ప్రతి ఒక్కరి పేరు కనుక్కుని పలుకరిస్తూ సీఎం కదిలారు. -
CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై..
వరదలు వచ్చినప్పుడే నేను కూడా ఇక్కడకు వచ్చి ఉంటే కలెక్టర్లు, అధికారులంతా నా చుట్టూనే తిరిగేవారు. టీవీ చానళ్లలో నేను బాగా కనిపించేవాడిని. నా ఫొటోలూ బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మంచి జరిగేది కాదు. అందుకే వరదల పరిస్థితి పూర్తిగా చూసిన తరువాత వారం రోజులు గడువు ఇచ్చా. ప్రతి బాధితుడికీ సాయం అందించాలని చెప్పా. పశువులకు సైతం మంచి చేసే విధంగా.. వాటికి కూడా నోరు ఉంటే మెచ్చుకునే విధంగా.. బాగా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. నేరుగా బాధితుల ఇళ్ల వద్దకు వచ్చి సాయం అందిందో లేదో అడుగుతానని అప్పుడే చెప్పా. అందుకే ఇన్ని రోజులు వేచి చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చా. ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు. – వరద బాధితులతో సీఎం జగన్ కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా, నిరంతరం శ్రమించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు కలసికట్టుగా పని చేసి అందరికీ తక్షణ సాయం అందించారని చెప్పారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా బాగా పని చేశారని అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత లంక గ్రామాల్లో సీఎం మంగళవారం పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద ముంపునకు గురైన గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, ఉడుమూడిలంక, బూరుగులంక, నున్నవారిబాడవ, మేకలపాలెం గ్రామాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. అందరికీ అన్ని రకాలుగా సాయం అందిందా?.. లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమకు సాయం అందిందని బాధితులంతా చేతులు పైకి ఎత్తి తెలియచేశారు. పర్యటనలో సీఎం ఏమన్నారంటే.. అరిగెలవారిపాలెంలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్ 15 రోజుల్లో నష్టం అంచనాలు.. ఈరోజు మన పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. అవి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది మీ ప్రభుత్వం. మీకోసం.. పని చేస్తున్న ప్రభుత్వం. కలెక్టర్ నుంచి వలంటీర్ల వరకు అధికార యంత్రాంగం అంతా వరదల్లో ఎంతో సమర్థంగా పని చేయబట్టే ఈరోజు అందరికీ సాయం అందింది. ఇప్పుడిప్పుడే ఉధృతి తగ్గుముఖం పడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. వరదల వల్ల జరిగిన నష్టాలపై వచ్చే 15 రోజుల్లో అధికారులు అంచనాలు తయారు చేయడం పూర్తి చేస్తారు. అది ఇల్లైనా పంటలైనా వేటినీ విడిచిపెట్టరు. రెండు మూడు నెలల్లో బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తాం. ఈ సీజన్లో జరిగిన నష్టాలకు సీజన్ ముగియకుండానే పరిహారం అందించే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జి.పెదపూడిలంకలో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న సీఎం జగన్ పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పర్యటనలో సీఎం వెంట మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, ఎంపీలు చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్‌కుమార్, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పోతుల సునీత, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, వరదలపై కోనసీమ ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, పీఆర్ ఈఎన్సీ సుబ్బారెడ్డి తదితరులున్నారు. గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి లంక గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణ బాధ్యత నాకు వదిలేయండి. వంతెన లేక మీరు పడుతున్న బాధలను ప్రతి గ్రామంలోనూ చెప్పారు. అన్నీ ఆలకించా. ఆ వంతెన నిర్మాణ పనులను మరో నెలన్నరలో ప్రారంభిస్తాం. సీఎం పర్యటన సాగిందిలా మంగళవారం ఉదయం 10.30 గంటలకు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల జి.పెదపూడికి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. లంక గ్రామాల్లో వర్షం పడడంతో రోడ్లు బురదమయమయ్యాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సీఎం బాధితుల వద్దకు వెళ్లి పరామర్శను కొనసాగించారు. 11.05 గంటలకు: జి.పెదపూడి దీవిలోకి అడుగుపెట్టిన సీఎం సుమారు 3.35 గంటల పాటు బాధితుల మధ్యనే గడిపి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2.50 వరకు స్వయంగా పరిశీలించారు. షెడ్యూల్లో లేకపోయినప్పటికీ స్థానికుల కోరిక మేరకు బూరుగులంకలో పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం రాజమండ్రి చేరుకున్నారు. రాత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అక్కడే ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీఎం బస చేశారు. -
కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
పుచ్చకాయలవారి పేట: గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా
-
బూరెలలంక: స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం జగన్
-
వరద నష్టంపై అంచనాలు పూర్తి కాగానే ఆదుకుంటాం: సీఎం జగన్
-
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి: సీఎం జగన్
-
వరద బాధితులందరికీ అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, కోనసీమ: వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని ఆయన బాధితులతో పేర్కొన్నారు. అంతేకాదు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్ ఆగకుండా తన పర్యటనను కొనసాగిస్తుండడం విశేషం. బాధితులందరికీ సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకుంటూ కాలినడకనే ముందుకెళ్తున్నారు. -
జోరు వానలోనూ ఆగని అడుగు.. జనం కోసం జగనన్న
తనను నమ్ముకున్న జనాలకు కష్టం వస్తే.. నేనున్నాంటూ ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే.. ప్రజాక్షేత్రంలోకి దిగి.. వాటిని పరిష్కరించాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలి. ఆదుకుంటానని హామీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడ్డ లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన చేపట్టారు. ఒకవైపు వర్షం కురుస్తోన్నప్పటికీ సీఎం జగన్ వరద బాధితులకు వద్ద వెళ్లి పరామర్శిస్తున్నారు. వారికి తానున్నాంటూ భరోసా ఇస్తున్నారు. జి. పెదపూడి(కోనసీమ జిల్లా): ఈరోజు(మంగళవారం) ఉదయం కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. దీనిలో భాగంగా జి.పెదపూడికి సీఎం జగన్ చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. కానీ సీఎం జగన్ భారీ వర్షంలోనూ ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. కచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్‌లో కన్పిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సీఎం స్థాయి వ్యక్తి చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకోవడమే జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వరద బాధితుల్ని పరామర్శించాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా లంక గ్రామాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలను వింటున్నారు. -
అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
05: 30PM ►రాజోలు మండలం మేకలపాలెంలో సీఎం జగన్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను గ్రామస్తులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 04: 10PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు సీఎం జగన్ చేరుకున్నారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు. 03: 30PM ►కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో రాజోలు మండలం మేకలపాలెంకు వెళ్లనున్నారు. అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు. 02: 30PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. 12: 58PM ►అరిగెలవారిపేటకు చేరుకున్న సీఎం జగన్ ►అరిగెలవారిపేట వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ►అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని సీఎం జగన్ హామీ 12:01PM ►పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్ ►సీఎం జగన్ జేబులోంచి పెన్ తీసుకున్న 8 నెలల బాబు ►8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్ ►శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను అడిగిన సీఎం జగన్ ►కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని అడిగిన సీఎం జగన్ ►వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎంకు చెప్పిన వరద బాధితులు 11: 20AM ►ట్రాక్టర్లో లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ 11:15AM ►పంటుపై లంక గ్రామాలకు చేరిన సీఎం జగన్ 11: 06 AM ►పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 10:34 AM ►పి.గన్నవరం మండలం జి. పెదపూడి చేరుకున్న సీఎం జగన్ ►జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం ►వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్ 9: 45AM డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్ ► అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ► అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ► అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. ► అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. ► అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ► రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డా.బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)