‘కోనసీమ రాకెట్‌’ సాత్విక్‌కు సత్కారం | sathwik satkar | Sakshi
Sakshi News home page

‘కోనసీమ రాకెట్‌’ సాత్విక్‌కు సత్కారం

Published Thu, Dec 15 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

sathwik satkar

అమలాపురం : 
షటిల్‌ బ్యాడ్మింట¯ŒSలో అంతర్జాతీయ క్రీడావేదికలపై వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘కోనసీమ రాకెట్‌’ రంకిరెడ్డి  సాత్విక్‌ సాయిరాజ్‌ను అమలాపురంలో గురువారం ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సాత్విక్‌ను పీడీలు, పీఈటీలు, పట్టణ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. స్థానిక ఆఫీసర్స్‌ క్లబ్‌లో బాలికల గ్రిగ్‌ పోటీల సందర్భంగా సాత్విక్‌ను అమలాపురం పీఈటీల అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో సన్మానించారు. అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య మాట్లాడుతూ అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్‌ను జిల్లా క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సాత్విక్‌ ఒలింపిక్స్‌లో ఆడి దేశానికి పతకాన్ని సాధించే రోజు రావాలని ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.రమేష్, బాలికల జో¯ŒS గ్రిగ్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎ.సూర్యనారాయణ, పీఈటీలు బీవీవీఎస్‌ఎ¯ŒSమూర్తి, బీటీ వర్మ, పాయసం శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, కమల్, కె.వెంకటేశ్వరరావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement