sathwik
-
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హనుమాన్ విగ్రహం లభ్యం!
ఆదిలాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సాత్విక్ సూసైడ్ లేఖ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సాత్విక్ లేఖలో రాసుకొచ్చాడు. ప్రిన్సిపల్, కాలేజీ ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేకపోయాను. వీరు నలుగురు నాతోపాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ అమ్మా.. నేను పడిన టార్చర్ వేరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నన్ను వేధించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి. అమ్మా నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్’ అంటూ సాత్విక్ తన సూసైడ్ నోట్లో రాశాడు. కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. -
ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్
అమలాపురం: ఒక తండ్రి 30 ఏళ్ల కల నిజం అయ్యింది. ఒక తల్లి చేసిన పూజలు.. వ్రతాలు ఫలించాయి. ఒక యువకుడి జీవిత లక్ష్యం నెరవేరింది. ప్రతి క్రీడాకారుడు కలలుకనేది ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్, అతని తల్లిదండ్రుల కల కూడా అదే. ఒలిపింక్ క్రీడావేదికపై సాత్విక్ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే. ఆ కల శనివారం నెరవేరనుంది. విశ్వక్రీడల్లో క్రీడా యుద్ధానికి సాత్విక్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్‌లో తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నాడు. సాత్విక్, చిరాగ్ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సాత్విక్ తన గురువు పుల్లెల గోపీచంద్ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కల నెరవేరింది. మనదేశం తరఫున ఆడుతున్నానే ఫీలింగ్ ఉత్సాహాన్ని నింపిందని టోక్యో వెళుతూ సాత్విక్ ‘సాక్షి’తో అన్నాడు. ట్రాక్ రికార్డు ► 2018 ఆస్ట్రేలియా కామన్వెల్త్ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ టీమ్ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్ మెడల్ ► డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి సిల్వర్ మెడల్ ► 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయిలాండ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణపతకాలు ► 2018 సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్ ► డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో 2016లో మౌరిటీస్ ఇంటర్ నేషనల్, ఇండియన్ ఇంటర్నేషనల్ సిరీస్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజయం చాలా సంతోషంగా ఉంది నేను షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడ్ని. అందుకే నా ఇద్దరు కుమారులను ఆ క్రీడలో ప్రోత్సహించాను. ఒక్కరైనా దేశం తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. అది నెరవేరబోతోంది. ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాయామోపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులకు ఒలింపిక్స్ గురించి గర్వంగా చెప్పేవాడిని. ఇప్పుడు నా కొడుకు ఆ క్రీడల్లో పాల్గొనడం.. చెప్పేందుకు మాటలు రావడం లేదు. – ఆర్.కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి, అమలాపురం -
ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్ మిస్
పారిస్ (ఫ్రాన్స్): ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడి సాత్విక్-చిరాగ్ జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి 18-21,16-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) ద్వయంపై ఓటమి పాలైంది. రెండు గేమ్‌ల్లో సాత్విక్-చిరాగ్‌లు పోరాడినప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోయారు. టాప్ సీడ్ చేతిలో సాత్విక్-చిరాగ్‌లు ఓటమి పాలై రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. కేవలం 35 నిమిషాలు పాటు జరిగిన తుది పోరులో గిడియోన్-సుకముల్జోలు ఆకట్టుకున్నారు. భారత్ జోడికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా 11 ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌లు 3వ ఓటమి. ఇక ఇండోనేసియా జోడి సుకుముల్జో-గిడియోన్ చేతిలో సాత్విక్-చిరాగ్‌లకు 7వ పరాజయం. ఈ టైటిల్ గెలిస్తే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో భారత డబుల్స్ జోడిగా సాత్విక్-చిరాగ్‌లు అరుదైన ఘనతను సాధించేవారు. కాకపోతే ఓటమి పాలు కావడంతో పార్తో గంగూలీ-విక్రమ్ సింగ్‌ల సరసన నిలిచే అవకాశాన్ని కోల్పోయారు. 1983లో పార్తో గంగూలీ-విక్రమ్ సింగ్‌లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత జోడి. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జంటను...క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం.. సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. ఐదో సీడ్ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. -
డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట
పారిస్ (ఫ్రాన్స్): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జంటను...క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోనూ గొప్ప విజయం సాధించారు. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–11, 25–23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జపాన్ జోడీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సాత్విక్–చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–6తో వెనుకబడి ఉంది. షెడ్యూల్ ప్రకారం పురుషుల డబుల్స్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత జరిగే అవకాశముంది. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వరుసగా 11 పాయింట్లు గెలిచి... పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండోనేసియా ప్లేయర్ జొనాథన్ క్రిస్టీ అత్యద్భుత విజయం సాధించాడు. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో 7–21, 22–20, 21–19తో గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక చివరి గేమ్‌లో ఒకదశలో క్రిస్టీ 10–19తో వెనుకంజలో నిలిచి ఓటమి అంచుల్లో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విజృంభించిన క్రిస్టీ వరుసగా 11 పాయింట్లు సాధించి చివరి గేమ్‌ను 21–19తో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. -
అమలాపురం నుంచి ఆస్ట్రేలియాకు
అమలాపురం: కోనసీమ కుర్రోడు రంకిరెడ్డి స్వాతిక్ సాయిరాజ్ రెండో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదిక అయిన కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వివిధ దేశాల్లో జరిగిన 15కు పైగా అంతర్జాతీయ బ్యాడ్మింటర్ పోటీల్లో సాత్విక్ తన ప్రతిభ చూపాడు. గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్ సత్తా చూపేందుకు సై అంటున్నాడు. సాత్విక్ మెన్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. సాత్విక్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం వ్యాయామ ఉపాధ్యాయుడిగా...ఫిజికల్ డైరెక్టర్‌గా... ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. సాత్విక్ కామన్వెల్త్కు వెళ్లడంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా ఒలింపిక్స్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజులు, కె.పద్మనాభం, ఉపాధ్యక్షడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, గొల్లవిల్లి నిమ్మకాయల రంగయ్య నాయుడు మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఒలింపిక్అసోసియేషన్ హర్షం భానుగుడి (కాకినాడ సిటీ): ఆస్ట్రేలియాలో బుధవారం నుంచి జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు షెటిల్ బాడ్మింటెన్లో భారత దేశం తరుపున అమలాపురం వాసి రంకిరెడ్డి స్వాతిక్ సాయిరాజ్ (17) ఎంపిక కావడంపై జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసిందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయిరాజ్ విజయంతో తిరిగిరావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.ఇంటర్మీడియట్ చదువుతున్న సాయిరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడని తెలిపారు. -
‘కోనసీమ రాకెట్’ సాత్విక్‌కు సత్కారం
అమలాపురం : షటిల్ బ్యాడ్మింట¯ŒSలో అంతర్జాతీయ క్రీడావేదికలపై వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘కోనసీమ రాకెట్’ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను అమలాపురంలో గురువారం ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సాత్విక్‌ను పీడీలు, పీఈటీలు, పట్టణ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో బాలికల గ్రిగ్ పోటీల సందర్భంగా సాత్విక్‌ను అమలాపురం పీఈటీల అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో సన్మానించారు. అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య మాట్లాడుతూ అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్‌ను జిల్లా క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సాత్విక్ ఒలింపిక్స్‌లో ఆడి దేశానికి పతకాన్ని సాధించే రోజు రావాలని ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.రమేష్, బాలికల జో¯ŒS గ్రిగ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సూర్యనారాయణ, పీఈటీలు బీవీవీఎస్ఎ¯ŒSమూర్తి, బీటీ వర్మ, పాయసం శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, కమల్, కె.వెంకటేశ్వరరావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.