
సాక్షి, తాడేపల్లి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
'రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పే.. మా పార్టీకి వచ్చే ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అయితే కాదు. ఒక మహానేత పేరు పెడితే పునరాలోచించాలిల్సిన అవసరం ఏముంది. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతాము. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి 👇
(ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్)
(Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు)
Comments
Please login to add a commentAdd a comment