
అనుమానం పెనుభూతమై..
భార్యను గొడ్డలితో నరికిన భర్త
మొండెం నుంచి తలను వేరుచేసిన వైనం
అనాథలైన పిల్లలు
అనుమానం పెనుభూతమైంది. కాపురంలో చిచ్చుపెట్టింది. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అన్యంపుణ్యం తెలియని ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త కసాయిగా మారాడు. గొడ్డలితో నరికేశాడు. తలను మొండెం నుంచి వేరుచేసి ఇంటి ముందు పడేశాడు. ఈ సంఘటన తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం పంచాయతీ గాంధీనగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
తిరుపతి క్రైం : తమిళనాడులోని బామలూరు తా లూకా, పాపంబాడి పంచాయతీ అన్నానగర్‌కు చెంది న పెరుమాళ్ దొరస్వామికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె చిత్ర(30)ను తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం పంచాయతీ గాంధీనగర్‌కు చెందిన గోవిందస్వామి రెండవ కుమారుడు మునస్వామి (35)కి ఇచ్చి 9 ఏళ్ల క్రితం పెళ్లి చేశాడు. వారికి శ్రీలత, సతీష్, తమిళ్ సెల్వి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మునస్వామి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతి రోజూ ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో చిత్ర పిల్లలను తీసుకుని సంక్రాంతి పండుగ రోజు పుట్టిం టికి వెళ్లిపోయింది. దీంతో మరింత అనుమానం పెం చుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించు కున్నాడు. మునస్వామి అన్న చంద్ర కలుగజేసుకుని ఆమెకు ఫోన్ చేశాడు. భర్త వద్దకు వచ్చి కాపురం చేసుకోవాలని చెప్పాడు. దీంతో ఆమె ఈ నెల 3వ తేదీన పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి 9 గంటల వరకు చంద్ర కుటుంబ సభ్యులు మునస్వా మి ఇంట్లోనే ఉన్నారు. అందరూ కలిసి భోజనం చేశా రు. తర్వాత వారు ఇంటికి వెళ్లారు. పథకం ప్రకారం మునస్వామి రాత్రి 10.50 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న చిత్రపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తల ను మొండెం నుంచి వేరు చేశాడు. తలను చేత పట్టుకుని సమీపంలో ఉన్న అన్న చంద్ర ఇంటి వద్దకు వెళ్లాడు.
దీన్ని చూసిన చంద్ర కుటుంబ సభ్యులు కేక లు వేశారు. దీంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకోగానే చిత్ర తలను అక్కడ పడేసి మునస్వామి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీ సులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మునస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.