ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఇంతకీ ఆమె ఎవరు? | Netizens Searching For Kalki 2898 AD Actress Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఆమెపైనే అందరి కళ్లు!

Published Fri, Jun 21 2024 4:20 PM | Last Updated on Fri, Jun 21 2024 4:37 PM

Netizens Searching For Kalki 2898 AD Actress Goes Viral

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కల్కి 2898 ఏడీ చిత్రం మరో వారంలో థియేటర్లకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్‌తో పాటు రానా కూడా పాల్గొన్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ కొత్త పంథాను ఫాలో అవుతున్నారు. ఇటీవల దిశా పటానీ బర్త్‌ డే సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేశారు. తాజాగా మరో నటిని కూడా పరిచయం చేశారు. కల్కిలో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్‌ను మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె కైరా పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇంతకీ ఆమె ఎవరంటూ నెటిజన్స్ వెతకడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం.

కేరళలోని కొచ్చికి చెందిన అన్నాబెన్‌ కల్కిలో కీలక పాత్రలో కనిపించనుంది.  మలయాళంలో కుంబలంగి నైట్స్‌ అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా  ఉత్తమ నటిగా సహా పలు అవార్డులు అందుకున్నారు.  మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె కల్కితో టాలీవుడ్ అభిమానులను పలకరించనున్నారు. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన లాంటి అగ్రతారలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement