మాల్‌లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు | Malayalam Actress Molested in A Mall | Sakshi
Sakshi News home page

మాల్‌లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు

Published Fri, Dec 18 2020 1:23 PM | Last Updated on Fri, Dec 18 2020 2:31 PM

Malayalam Actress Molested in A Mall - Sakshi

ఆడవారిని చూస్తే చాలు కొందరు మగాళ్ల బుర్రలోకి పురుగు దూరుతుంది. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెట్టి.. బాధపడుతుంటే ఆనదించడం వీరికి మహా సరదాగా ఉంటుంది. చుట్టూ ఎందరు ఉన్నా సరే వీరు ఏ మాత్రం భయపడరు. పైగా చూడటానికి ఎంతో మర్యాదస్తులుగా బిల్డప్‌ ఇస్తూ.. చండాలపు పనులు చేస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీలను చూస్తే.. వీరి సైకోయిజం పీక్స్‌కు చేరుతుంది. ఎలాగోలా వారిని వేధింపులకు గురి చేసి.. సంబరపడుతుంటారు. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. కుటుంబంతో కలిసి షాపింగ్‌ కోసం మాల్‌కి వెళ్లిన సదరు నటిని ఇద్దరు వ్యక్తులు అసభ్యకర రీతిలో తాకి.. వేధింపులకు గురి చేశారు. ఈ ఊహించని ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నటి.. కుటుంబ సభ్యులు వచ్చి పలకరించే వరకు ఆ షాక్‌ నుంచి తేరుకోలేక పోయినట్లు తెలిపారు. అనంతరం వారికి బుద్ది చెప్పాలని భావించి చూడగా అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఇక తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు నటి. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: 'పాక్‌ కెప్టెన్‌ నన్ను నమ్మించి మోసం చేశాడు')

ఇక దానిలో సదరు నటి ‘సోషల్‌ మీడియాలో నాటకీయంగా మాట్లాడటం నాకు చేతకాదు. కానీ ఈ రోజు నేను ఎదుర్కొన్న భయానక అనుభవం నా చేత ఈ పని చేయిస్తుంది. అమ్మ, చెల్లి, అన్న, నాన్నతో కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న లూలు హైపర్‌మార్కెట్‌కి వెళ్లాను. అక్కడ నన్ను గమనించిన ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకి వచ్చి.. మాట్లాడేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాల వివరాలు అడిగారు. ఇంతలో ఓ వ్యక్తి నా భుజం మీద చేయి వేశాడు. వెంటనే నేను మీ హద్దుల్లో ఉంటే మంచిది అని హెచ్చరించే సరికి చేయి తీశాడు. నేను ఇబ్బంది పడటం గమనించి మా అమ్మ నావైపు రాసాగింది. ఇది గమనించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్తున్నవారిద్దరిలో ఓ వ్యక్తి నా వెనక భాగంలో అసభ్యకరంగా తాకి వెళ్లాడు. ఒక్క నిమిషం పాటు నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నా పరిస్థితి గమనించి మా చెల్లి నా దగ్గరకి వచ్చి.. ‘నేను బాగానే ఉన్నానా’ అని ప్రశ్నించిది. అప్పుడు నేను ఈ లోకంలోకి వచ్చాను. జరిగిన అవమానం గుర్తుకు వచ్చి ఏడుపొచ్చింది. నాకు ఇంత అవమానం చేసిన వారి చెంప పగలగొడదామని భావించి వారి కోసం చూశాను. కానీ అప్పటికే అక్కడి నుంచి జారుకున్నారు’ అని తెలిపారు. (చదవండి: బాలిక శీలానికి వెలకట్టారు! )

‘ఇక ఇంటికి వచ్చాక కూడా నా మీద నాకే కోపంగా ఉంది. నాకు అవమానం జరిగినప్పుడు వెంటనే స్పందించలేకపోయాను. వెధవల చెంప పగలగొట్టలేకపోయాననే బాధ వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే స్పందించి.. ధైర్యంగా ఎదురుతిరగాలనే ఉద్దేశంతో దీని గురించి వెల్లడిస్తున్నాను’ అంటూ షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నటికి మద్దతుగా నిలుస్తూ.. ఇలాంటి శాడిస్టులను ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఈ పోస్ట్‌ని సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ కేసు రిజిస్టర్‌ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement